మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్ చంద్ర ఘనీలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ‘గని’ కోసం స్టార్ డైరెక్టర్ కూతురు సింగర్ గా మారుతున్నట్టు తెలుస్తోంది.
Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్
అగ్ర దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ నటిగా, గాయనిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె కోలీవుడ్ లో కార్తీ సరసన ‘విరుమాన్’తో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు సింగర్ గానూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ‘గని’లో ‘రోమియో జూలియట్’ అనే పాటను పాడిందట. ఫిబ్రవరి 25న ‘గని’ విడుదల కానుండగా, ఫిబ్రవరి 8న విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో చిత్రబృందం సమక్షంలో జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్ ఈ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.