ఒక డైరెక్టర్ కి హిట్ పడితే పొగరు ఎక్కువ అవుతుందని కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ అనడం ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు బెంచ్ మార్క్ అయిన మిస్కిన్ తాజాగా జరిగిన ‘సెల్ఫీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సినిమా రంగానికి వచ్చే కొత్త దర్శకులు తమ మొదటి సినిమా హిట్ అవ్వగానే వారి ఆలోచన మారిపోతుంది. తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చేయొచ్చు అనుకుంటారు. వారికి ఆ పొగరు తలకెక్కుతుంది. అలాంటి ఆలోచన రాకూడదు. అది తప్పు. మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించాను.
ఇక కెరీర్ మొదట్లో మనమీద వచ్చే గాసిప్స్ పట్టించుకోకూడదు. ఎప్పుడు మంచి విషయాల గురించే చర్చించాలి. అలా మాట్లాడుతూ హిట్ అందుకున్న దర్శకుడు వెట్రి మారన్. ఇప్పుడు ఆయన శిష్యుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్నాడు. అతడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మిస్కిన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.