సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సినిమాల జాతర మొదలవుతుంది. అలా టాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందులో ‘డాకు మహారాజ్’ ఒకటి. బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. బాలయ్య మాస్ యాక్షన్ అదుర్స్ ముఖ్యంగా కథ విషయంలో బాబీ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాడు. అందుకే ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది.
ఇదే సంక్రాంతికి రెండేళ్ల క్రితం ‘వాల్తేరు వీరయ్య’ అంటూ వచ్చి హిట్టు కొట్టిన బాబీ ఇప్పుడు ‘డాకు మహారాజ్’ అంటూ బాలయ్యతోనూ బ్లాక్ బస్టర్‌ను కొట్టాడు. ఇలా చిరంజీవితో, బాలయ్యతో హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. దీంతో ప్రేక్షకులు బాబీ తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తారా అనే ఆలోచనలో పడ్డారు.
అయితే తాజాగా దర్శకుడు బాబీ మరో స్టార్ హీరోతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నడని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా వెంకటేష్ తో లేదా రవితేజతో చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజంట్ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తూన్నాం’ మూవీ హిట్‌ని ఎంజయ్ చేస్తున్నాడు. ఇక రవితేజ మొన్నటి వరకు వరుస సినిమాలు చేసినప్పటికి ఆషించినట్లుగా హిట్ మాత్రం అందుకోలేకపొయ్యాడు. ఒక వేల కనుక బాబీ రవితేజతో మూవీ తీస్తే.. మాస్ రాజ అడుగులు విజయం వైపు పడతాయని చెప్పో్చ్చు.