హీరో కొడుకు హీరోనే అవ్వాలి అనే రూల్‌ని బ్రేక్ చేశాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. అందానికి అందం మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఆర్యన్ ఖాన్ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయం అభిమానుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బడా ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆర్యన్ రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’. అయితే ఈ సిరీస్ మామూలు సిరీస్ కాదు.. ఈ ప్రాజెక్టులో రణవీర్ సింగ్, అలియా భట్, బాబీ డియోల్,రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్‌లు స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నారని సమాచారం. అంతే కాదు మన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు..
Also Read: Retro: రొమాన్స్ & యాక్షన్‌తో రెట్రో తెలుగు టీజర్ రిలీజ్
SS రాజమౌళి కూడా ఈ సిరీస్‌ల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్యన్ ఖాన్ తొలి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ ‘బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా దీనికి భారీ స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సిరీస్ జూన్ 2025 మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. అయితే షారుఖ్ టీం ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్య విస్తృతంగా ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ట్రైలర్‌ను సమర్ స్టార్టింగ్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కాగా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఫోటోలు రివిల్ అవ్వగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.