రీసెంట్ గా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ప్రజంట్ వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు సూర్య . ఇందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తున్నప్పటికి.. ఇటివల రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ ‘రెట్రో’ సినిమాలో సూర్య వైవిధ్యమైన వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read:War2 : ఆమెతో ‘వార్ 2’ లో సాలీడ్ ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్న మూవీ టీం..
ఇక ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ టీం ‘రెట్రో’ తెలుగు టీజర్ ని కూడా విడుదల చేసింది.ఈ టీజర్ పాతకాలపు మేకింగ్ విధానం తో కూడిన యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది.హీరో చెప్పిన డైలాగ్ ప్రకారం ఈ మూవీలో అగ్రెసివ్ పర్సనాలిటీ అయిన సూర్య తన తండ్రి కారణంగా గొడవలు పడతాడు. హీరోయిన్ పూజ అతని జీవితంలోకి ప్రవేశించి హీరోని మార్చడానికి ప్రయత్నిస్తుంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి, కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అయ్యాయి. మొత్తానికి ఈ టీజర్ ‘రెట్రో’ పై అంచనాలు మరింత పెంచింది.