Dil Raju:ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో హార్ట్ కింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అంటే అథాశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మరోపక్క చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలను అందిస్తున్నాడు. దిల్ రాజుకు ఇండస్ట్రీలో శత్రువులు తక్కువేమి లేరు.. ఆయనకు వివాదాలు కొత్తేమి కాదు. తన విజయాలను తట్టుకోలేని వారు తనపై బురద జల్లుతున్నారు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా దిల్ రాజు గురించిన ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే.. దిల్ రాజు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంట.. మరి కొద్దిరోజుల్లో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.. అదేంటంటే.. ఇటీవల దిల్ రాజు,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యాడు.
Keerthy Suresh: నువ్వు ‘మహానటి’ ఏంటీ అంటూ ట్రోల్ చేశారు
నిజామాబాద్ జిల్లాలో వీరు కలిసి కనిపించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి.. నిజామాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు.. తన సొంత గ్రామమైన నర్సింగ్ పల్లిలో ఆయన ఖర్చుతో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారట. దీంతో దిల్ రాజు.. రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య బలగం సినిమాతో కేటీఆర్ లాంటి వారినే మెప్పించిన దిల్ రాజు.. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చనువుగా ఉండడం అంతుచిక్కకుండా ఉంది. కాంగ్రెస్.. దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచే దిల్ రాజును పోటీ చేయించాలని చూస్తుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే దిల్ రాజు తన పొలిటికల్ ఎంట్రీపై నోరు విప్పాల్సిందే.