దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్ చేసాం. వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం.
Also Read : KhushiKapoor : గ్లామరస్ ఫొటోస్ తో కనుల విందు చేస్తున్న ఖుషి కపూర్…
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 57 సినిమాలు పూర్తయ్యాయి. నేను శిరీష్ కథ విని బాగుందన్న తర్వాతనే స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. హర్షిత్ హన్సిత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పెట్టి బలగం వేణు తో పాటు నలుగురు కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు. కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచన ఈ దిల్ రాజు డ్రీమ్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ సినిమాలు తీస్తున్నాం. దిల్ రాజ్ ప్రొడక్షన్ పై కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. దిల్ డ్రీమ్స్ సంస్థని ఒక యంగ్ జనరేషన్ టీం తో ఫామ్ చేసాము. చాలామంది నిర్మాతలుగా రావాలనుకుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గాని సినిమాని ఎలా మొదల పెట్టాలి ఎలా కంప్లీట్ చేయాలో క్లారిటీ ఉండదు. సినిమా తీయడం ముఖ్యం కాదు సినిమాని తీసి ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్లడం పెద్ద టాస్క్, అందరికీ సినిమాల్లోకి రావాలని పాషన్ వుంది. కానీ రైట్ ఫ్లాట్ ఫామ్ వాళ్లకి దొరకదు. అలాంటి రైట్ ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేయడానికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ గా లక్ష నుంచి రెండు లక్షల మంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఈ ప్లాట్ ఫామ్ ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థం అవుతుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు.