Dil Raju Comments at The Family Star Sucess Meet: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – నిన్న మీడియా మిత్రుల కుటుంబాలతో కలిసి మా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించాం, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశాం.
ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్ స్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కు వెళ్తున్నారని చెప్పారు, హైదరాబాద్ లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూశా, 90 పర్సెంట్ యూత్ ఆడియన్స్ థియేటర్ లో ఉన్నారు. నేను ఏ ఏ సీన్స్ లో ఆడియన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగిందన్నారు. సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారని, మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైందన్నారు.
Yatra 2 OTT: ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2
మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది, ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కి వెళ్తున్నారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి, సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది, అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్ కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పామని అన్నారు. మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియాలో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మీడియా షో చూశాక నాతో టచ్ లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు.
మేము సినిమాలో బామ్మకు మనవడికి మధ్య చూపించిన ఎమోషన్, , బాబాయ్, పిల్లలు, అన్నాదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతోంది అన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారని అన్నారు. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ ను ఎంజాయ్ చేయండి, సినిమా చూశాక మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్ లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి రేపటి నుంచి వారిని కలవబోతున్నాం, ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేశాం అని అన్నారు. పర్సనల్ గా నేను, విజయ్, పరశురామ్, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నాం అని దిల్ రాజు అన్నారు.