యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియోలో ఏప్రిల్ 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా థియేటర్ నుంచి డిజిటల్ కి రావడానికి నాలుగు వారాలు టైం పడుతుంది. హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా కూడా కొద్దిగా అటు ఇటు గ్యాప్ లో వస్తాయి కానీ మరి ఇరవై రోజుల్లోనే ఈ సినిమ ఓటిటీ బాట పట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అనే చెప్పాలి. రాహుల్ పరిస్థితి మరి అంత దారుణంగా ఉందా..? అంటే నిజమే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.. మర్చి 11 న రాధేశ్యామ్ రిలీజ్ అయ్యింది.. దాని దాటుకొని మార్చి 18 న చిన్న సినిమాగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా హైప్ తెచ్చుకొనేలోపు మార్చి 25 ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యింది. భారీ సినిమాల మధ్య ఈ సినిమా కొట్టుకుపోయింది. మరి థియేటర్లో హైప్ తెచ్చుకోలేని ఈ చిత్రం ఓటిటీలో ఎలాంటి హైప్ తెచ్చుకుంటుందో చూడాలి.
#StandUp ane word strict PT teacher laga anipichina, movie matram fun untadi😉#StandUpRahulOnAHA premieres April 8, sit and watch it 😎@itsRajTarun @VarshaBollamma @standupsanto @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 @sonymusicsouth pic.twitter.com/fTN3MqvXg6
— ahavideoin (@ahavideoIN) March 29, 2022