Varisu: దిల్ రాజు.. దిల్ రాజు.. దిల్ రాజు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే మారుమ్రోగిపోతున్న పేరు. వారసుడు సినిమా కోసం దిల్ రాజు చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వారసుడు సినిమాను జనవరి 11 న రిలీజ్ చేయడానికి ఆయన పడిన కష్టం అంత ఇంతా కాదు. కానీ, చివరి నిమిషంలో బాలకృష్ణ, చిరంజీవి సినిమాల కోసం తాను తన సినిమాను త్యాగం చేస్తున్నట్లు తెలిపి జనవరి 14 న తెలుగులో వారసుడు రాబోతున్నట్లు తెలిపాడు. ఇక అదే దిల్ రాజు చేసిన పెద్ద తప్పు అని పలువురు చెప్పుకొస్తున్నారు. జనవరి 11 న వరిసు తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ ను అందుకుంది. ఇక అదే సమయంలో తెలుగులోనూ రిలీజ్ చేసి ఉంటే ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యేదని చెప్పుకొస్తున్నారు.
మరో పక్క అదే రోజు రిలీజ్ అయిన అజిత్ సినిమా మిక్స్డ్ టాక్ అందుకోవడంతో మరింత హిట్ ను విజయ్ అందుకొనేవాడని విజయ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సరే వారసుడు తెలుగులో రిలీజ్ అయ్యి ఉంటే నేడు వీరసింహారెడ్డి కి పోటీగా నిలిచేవాడా..? లేదా అనేది పక్కన పెడితే.. థియేటర్ల విషయంలో మాత్రం ఇప్పుడైనా దిల్ రాజు తగ్గక తప్పేది కాదు.. అందుకే దిల్ రాజు మంచి పనే చేశాడు.. రేపు వాల్తేరు వీరయ్య రిలీజ్ కానుంది.. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల మధ్య వారసుడు నలిగిపోయేది కాబట్టి దిల్ రాజు తన సినిమాను ముందుకు నెట్టడం మంచి పనే అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా వారసుడు గట్టి విజయాన్ని అందుకుంటుందని మొదటి నుంచి దిల్ రాజు నమ్మకంగానే ఉన్నాడు. ఎప్పుడు రిలీజ్ అయినా సినిమా హిట్ అవుతుందని చెప్పుకురావడంతో అభిమానులు కూడా జనవరి 14 న సినిమా ఎలా ఉంటుందో మేము చూసి చెప్తామని చెప్పుకొస్తున్నారు.