Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట.. ఇప్పుడు కాదు ఏడాది కూడా కావొస్తుంది. అయితే ఇప్పుడేలా లీక్ అయ్యింది అంటే.. ఆమె గురించి టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.
ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుందని, మొదటి నుంచి ఆమె చెన్నై వెళితే బాలాజీ మోహన్ తోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. అప్పటికే బాలాజీ కి పెళ్ళై భార్యకు విడాకులు ఇచ్చాడని, ఆమె సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం చేస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రమోషన్స్ సమయంలో ఆమె రాకపోవడానికి కారణం కాబట్టి ఈ విషయం చెప్పినట్లు తెలిపింది. అయితే పెళ్లి చేసుకున్నా వారు ప్రపంచానికి చెప్పాలనుకోవడం లేదని, కానీ ధన్య గురించి తనకు భయంగా ఉందని, అతడు ఆమెను టార్చర్ పెడతాడేమో అనుకున్నాను కానీ, వారు ఇప్పుడు బాగానే ఉన్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చింది” ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.