బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో దీపికా, సిద్ధాంత్ ల మధ్య శృంగార సన్నివేశాలు మితిమీరి కనిపించడంతో ట్రోలర్స్ దీపికాను ఏకిపారేస్తున్నారు.
పెళ్లి తర్వాత కూడా ఇలాంటి ఘాటు రొమాన్స్ లో నటించడానికి బుద్ది లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో ఒక నెటిజన్ ఇదే ప్రశ్న వేయగా దీపికా సీరియస్ అవ్వడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఈ సినిమాలో ముద్దు సీన్లు ఉన్నాయి కదా.. ముద్దు సీన్లకు భర్త రణ్వీర్ పర్మిషన్ తీసుకున్నారా..? అని ఒక నెటిజన్ అడగగా.. దీపికా “ఈ ప్రశ్న అడిగినవారు మానసిక స్థితికి నేను జాలి పడుతున్నాను. అయినా సినిమాలు నాకెంత ఇష్టమో అందరికి తెలుసు.. ఆ విషయం నా భర్తకు కూడా తెలుసు. నేను అడిగానా.. అడగలేదా అనేది నా పర్సనల్. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు చాలా తెలివి తక్కువ వారు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలలో కొద్దిమంది చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది” అంటూ మండిపడింది. ఈ విషయాన్నీ నార్మల్ గా కూడా చెప్పొచ్చు.. దీనికి ఎందుకు అంత సీరియస్ అవ్వడం అంటూ నెటిజన్లు దీపికాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు