MM. Keeravani: ఇది లోకంలోనే అత్యంత అరుదైన గిఫ్ట్… నా కన్నీళ్లు ఆగడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇక దీంతో ఇండియానే కాదు ప్రపంచం మొత్తం వారిని ప్రశంసిస్తోంది. సాధారణ అభిమానులతో పాటు దేశ, విదేశ ప్రముఖులు సైతం కీరవాణిని, రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా కీరవాణిని మరియు చంద్రబోస్ ను ప్రముఖ మ్యూజిషియన్ రిచర్డ్ కార్పెంటర్ తన కుటుంబంతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రపంచంలోనే అద్భుతమైన మ్యూజిషియన్ లో ఒకరు. ది కార్పెంటర్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆస్కార్ వేదికపై కీరవాణి సైతం చిన్నతనం నుంచి కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగానని చెప్పుకొచ్చారు. అలాంటి రిచర్డ్ కార్పెంటర్.. తన ఫేమస్ సాంగ్ అయిన టాప్ ఆఫ్ ది వరల్డ్ సాంగ్ ను కొంచెం మార్చి తన కూతుర్లతో పాటు.. పాడుతూ కీరవాణి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Nani: సక్సెస్ వస్తే నా పేరు చెప్పి.. ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ పేరు చెప్పను
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక తనకు ఎంతో ఇష్టమైన గాయకుడు రిచర్డ్ కార్పెంటర్ తనకు శుభాకాంక్షలు చెప్పడంతో కీరవాణి తబ్బిఉబ్బిపోయారు. అసలు ఇది కలయా.. నిజమా అన్నట్లు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ” ఇది చాలా స్పెషల్.. నేను ఎప్పుడు ఇది ఉహించలేనిది. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. లోకంలోనే అత్యంత అద్భుతమైన బహుమతి.. ధన్యవాదాలు” అంటూ కీరవాణి చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి సైతం ఈ వీడియోపై స్పందించాడు. ” సార్, ఈ ఆస్కార్ క్యాంపెయిన్‌లో నా సోదరుడు ప్రశాంతంగా ఉండేవాడు. గెలవడానికి ముందు అయినా, తర్వాత అయినా అతను తన భావోద్వేగాలను బయటపెట్టలేదు. కానీ, ఇది చూసిన క్షణంలో కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాడు.. మా కుటుంబానికి మరపురాని క్షణం.. చాలా ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!