ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఒక కల్ట్ సినిమా కూడా లవర్స్ కోసం రీరిలీజ్ అవడానికి రెడీ అయ్యింది. గతేడాది జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్దంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది.
యూత్ ని అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి రికార్డులని కూడా బ్రేక్ చేసి బేబీ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో అన్ని సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపించి వంద కోట్ల మార్క్ ని చేరుకుంది. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 14న బేబీ సినిమా రీరిలీజ్ అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. లవర్స్ ఈ సినిమాకి ఎంతవరకు వెళ్తారు అనేది తెలియదు కానీ సింగల్ బాయ్స్ మాత్రం బేబీ థియేటర్స్ కి వెళ్లి రచ్చ చేయడం గ్యారెంటీ.