మాస్ సినిమాలు… చిన్న కథతో లేదా అసలు కథే లేకుండా ఫైట్స్, డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ సినిమా మొత్తం ఉంటాయి కాబట్టి మాస్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు… ఇవి ఆర్ట్ సినిమాల్లా ఉంటాయి, కథ ఎక్కువగా ఉంటుంది స్లో పేస్ లో సినిమా నడుస్తూ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి మెసేజ్ ఇచ్చి బయటకి పంపిస్తాయి. మాస్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు కాబట్టి రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈ సినిమాలు పెద్దగా ఎక్కవు, అందుకే ఇవి పెద్దగా ఆడవు. అయితే ఇది శంకర్ రానంత వరకే. ఏ రోజైతే శంకర్ డైరెక్టర్ గా మారాడో ఆరోజు నుంచి కమర్షియల్ సినిమా-మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనే వవేరు వేరు జానర్స్ పూర్తిగా కలిసిపోయాయి. కమర్షియల్ సినిమాలకి శంకర్ కొత్త అర్ధం చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత మాస్ సినిమా చేసినా దానికి మెసేజ్ రంగులు అద్ది ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేసేవాడు శంకర్. అందుకే కమర్షియల్ సినిమాలని డిఫైన్ చేయాలి అంటే శంకర్ కి ముందు శంకర్ కి తర్వాత అని చెప్పాలి.
జెంటిల్ మాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలు పక్కా కమర్షియల్ సినిమాలా లేక మెసేజ్ ఇచ్చే సినిమాలా అంటే వేరు చేసి చెప్పలేని పరిస్థితి. అంతగా రెండు ఎలిమెంట్స్ ని జెల్ చేసి పేక్షకులని ఒక మంచి సినిమాని అందిస్తాడు శంకర్. అంతేకాదు థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తూ ప్రపంచ అందాలని పాటల్లో చూపించడం శంకర్ స్టైల్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శంకర్ ట్రాక్ లో నడిచిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు కొత్తగా పాన్ ఇండియా అనే పదం వినపడుతుంది కానీ సోషల్ మీడియా ప్రభావం కూడా పెద్దగా లేని రోజుల్లోనే శంకర్ పాన్ ఇండియా ఆడియన్స్ కోసం సినిమాలు చేసాడు. రాజమౌళిని ఒకప్పుడు నెక్స్ట్ శంకర్ అన్నారు అంటే అప్పటికే శంకర్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ చేసిన ఫ్లాప్ సినిమా రోబో 2.0 కోలీవుడ్ కి ఈరోజుకి బిగ్గెస్ట్ హిట్, ఆ సినిమా కలెక్షన్స్ ని దాటడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ దాన్ని అందుకోవడం మాత్రం జరగట్లేదు, అది శంకర్ సినిమాల రేంజ్. ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న శంకర్… ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, గత కొన్నేళ్లుగా శంకర్ టైమ్ అయిపొయింది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ రేంజ్ డైరెక్టర్ కి ఒక్క హిట్ చాలు మళ్లీ తన మార్కెట్ రేంజ్ ఏంటో చూపించడానికి. ఆ హిట్ 2024లోనే వచ్చే అవకాశం ఉంది. 2024లో శంకర్ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి. ఇవి హిట్ అయితే శంకర్ అనే పేరు మళ్లీ పాన్ ఇండియా మొత్తం వినిపించడం గ్యారెంటీ.