Unstoppable 2:నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ 2. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షో కోసం ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సీజన్ 2 మొదలయ్యింది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు రాగా.. సెకండ్ ఎపిసోడ్ లో సిద్దు, విశ్వక్ సేన్ సందడి చేశారు. ఈ రెండు ఎపిసోడ్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దీంతో మూడో ఎపిసోడ్ కు గెస్టు గా ఎవరు రాబోతున్నారా..? అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. అయితే మూడో ఎపిసోడ్ కు అతిధిగా మినిస్టర్ రోజా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ, రోజా ఇద్దరు కలిసి పలు సినిమాలో నటించారు. మొదట్లో రోజా టీడీపీ లో ఉండి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. నిత్యం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయినా వీరిద్దరిని కలిపే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే కనుక నిజమైతే దబిడి దిబిడే అంటున్నారు. ఇంకొందరు మాత్రం రోజా వచ్చే అవకాశాలు లేవని, ఇటీవలే ఆమె ఈ షో పై విమర్శలు చేసింది కాబట్టి ఆమె వస్తే.. ఆమెను కూడా విమర్శించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.