Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ అదిరిపోయాయి. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాను 2026 మార్చి 26న అంటే పెద్దికి ఒకరోజు ముందు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు సుకుమార్ శిష్యులవే. పైగా రెండు సినిమాల వెనక సుకుమార్ హస్తం ఉంది. ప్యారడైజ్ రిలీజ్ డేట్ తెలిసి కూడా పెద్ది సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.
Read Also : Peddi : పెద్ది గ్లింప్స్.. బుచ్చిబాబుపై పెరిగిన బరువు..!
నాని కంటే రామ్ చరణ్ కు పెద్ద మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్యారడైజ్ లో నాని లుక్, విజువల్స్, కథ అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై విపరీతమైన హైప్ పెరిగింది. పైగా ఈ రెండు సినిమాల కంటే వారం రోజుల ముందు యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. అటు రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ వార్ మూవీని మార్చి 20కి రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. పైగా అన్నీ పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ తో పాటు భారీ హైప్ ఉన్న మూవీలే.
ఏ మాత్రం తేడా కొట్టినా పెద్ది సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇవన్నీ తెలిసే పెద్ది రిలీజ్ డేట్ ను లాక్ చేశారా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమాను ఎవరూ ఆపలేరు. కాకపోతే కంటెంట్ తో పాటు పోటీ కూడా తక్కువగా ఉంటే కలెక్షన్లు అనుకున్నంత వస్తాయి. మరి పెద్ది, ప్యారడైజ్ లో ఎవరో ఒకరు తగ్గుతారా లేదా అన్నది తేలాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఈ రెండు సినిమాలకు అతిపెద్ద మార్కెట్లు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఎవరో ఒకరు రిలీజ్ డేట్ ను మార్చుకుంటే బాగుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.