Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. వారు ఎన్నడూ ఒక చిన్న గ్లింప్స్ కోసం ఇలా ఎదురు చూడలేదు. కానీ మొదటిసారి బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. పైగా ఒకే పనిచేయడానికి, ఒకేలా బతకడానికి ఈ ఇంత పెద్ద బతుకు ఎందుకు అని డైలాగ్ చెప్పించడాన్ని బట్టి చూస్తే.. పెద్ది వ్యక్తిత్వాన్ని ఇందులో చూపించాడని అర్థం అయిపోతోంది. ఏఆర్ రెహమాన్ బీజీఎం దీనికి ప్లస్ అయింది.
Read Also : Badminton coach: 16 ఏళ్ల బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం.. మొబైల్‌లో బాలికల నగ్న చిత్రాలు..
పైగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టడం చూస్తే.. ఈ ఒక్క షాట్ తోనే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో అనుమానాలు అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇందులో బుచ్చిబాబు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, రామ్ చరణ్ గెటప్, విలేజ్ విజువల్స్, స్లాంగ్ అన్నీ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. మిగతా క్యారెక్టర్లు, సినిమా కథ ఏదీ తెలియకుండా బుచ్చిబాబు ఈ గ్లింప్స్ ను పవర్ ఫుల్ గా కట్ చేయించాడు. కేవలం పెద్ది ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ 60 సెకన్ల వీడియో వదిలాడు. ఇందులో కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ గురించే చూపించాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అసలే గేమ్ ఛేంజర్ నిరాశ తర్వాత వస్తుండటంతో బుచ్చిబాబుపై మరింత బరువు పెరిగిపోయింది. ఈ సినిమాతో భారీ హిట్ ఇస్తాడనే నమ్మకాన్ని పెంచేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి బుచ్చిబాబు తనపై పెరుగుతున్న భారాన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.