Co- Director Siva Commits Suicide at Borabanda: సినీ పరిశ్రమ మీద మక్కువతో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ వచ్చి చేరుతూ ఉంటారు. దర్శకులు అవ్వాలని, హీరోలు-హీరోయిన్లు అవ్వాలని హైదరాబాద్ వచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ కష్ట పడుతూ ఉంటారు. అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఈ సినీ పరిశ్రమలో ఎంట్రీ అంత ఈజీగా అయితే దొరకదు. ఒకవేళ దొరికినా వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణిస్తారా? లేదా? అనేది చెప్పలేం. అయితే ఇలా ఒక లక్ష్యంతో వచ్చి అది నెరవేరేలేదని భాద పడే వారు చాలా మంది వెనక్కి వెళ్లి తమకు నచ్చిన పని చేసుకుంటూ బతికేస్తూ ఉంటె కొంతమంది మాత్రం ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు.
Jr NTR: ఎన్టీఆర్ ను ప్రమాణ స్వీకారానికి పిలవలేదా? ఏంటీ కన్ఫ్యూజన్?
ఈ క్రమంలో షార్ట్ ఫిలిం కో-డైరెక్టర్ శివ బోరబండలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివ హైదరాబాద్ వచ్చి ఇటీవలే షార్ట్ ఫిలిం సినిమాల్లో కో-డైరెక్టర్ గా వ్యవహరించాడు. హైదరాబాద్ బోరబండలో నాలుగు నెలలుగా నివాసం ఉంటున్న శివ ఒంటరితనంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాదాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని బోరబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.