టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
ఇక ఈ సినిమాలో సంక్రాంతికి సంబందించిన ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ ను ఎవరితో పాడించాలని హిందీ, కన్నడ, మలయాళం సింగర్స్ ను పరిశీలిస్తుండగా నేను పాడతా అని హీరో వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి వెంట పడుతున్నాడు. ఎక్కడికి వెల్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ నేను సాంగ్ పాడత అని అనిల్ రావిపూడిని వెంకీ టార్చర్ చేయగా ఇక తట్టుకోలేక వెంకీ పాట పాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనిల్. పైన చెప్పుకున్నదంతా సీరియస్ కాదు చాలా సరదాగా అనిల్ రావిపూడిని అట పట్టిస్తున్న ఈ వీడియోను కాసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. నెటిజన్స్ నుండి ఈ వీడియోకు అద్భుత స్పందన లభిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న మూడో లిరికల్ సాంగ్ ను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read : Pushpa -2 Collections : రూ. 100 కోట్లైతే బాహుబలి ఔట్.. రూ. 200 కోట్లైతే హిస్టరీ.!