తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కంగువ వాస్తవానికి అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుండి తప్పుకుంది. ఇటీవల కంగువ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో కంగువ టీమ్ మీడియాతో ముచ్చటించింది.
Also Read : Rana : రామ్ గోపాల్ వర్మతో SS. రాజమౌళి షూటింగ్
కాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఎప్పడు అని ఎదురు చుసిన ఫ్యాన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. ఈ అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు వీడియో రిలీజ్ చేస్తూ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆడియో ఈవెంట్ ను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య సరసన దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది
Chennai Makkaley! Are you ready to welcome the King? 👑
Witness our #Kanguva in all his glory at the Grand #KanguvaAudioLaunch 🗡️
📍Nehru Stadium 🗓️ October 26th, 2024 🕕 6 PM onwards#KanguvaFromNov14 🦅@Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen… pic.twitter.com/5a7R62gwl1
— Studio Green (@StudioGreen2) October 20, 2024