రాజమౌళి చాలా రోజుల తర్వాత షూట్ లో పాల్గొనబోతున్నాడు. SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట కనిపించడం తగ్గించేశారు. దేవర రిలీజ్ నాడు కనిపించిన దర్శక ధీరుడు మల్లి కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయనున్నారు.
Also Read : VishwakSen : శ్రీరాములు థియేటర్ కు మాస్ కా దాస్
ఇటీవల కాలంలో టాక్ షోస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆహా లో ప్రసారమయ్యే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్ సాదించింది. అదే కోవలో త్వరలో ఈటీవి ఓటీటీ కోసం ఓ స్టార్ హీరోతో టాక్ షో ప్లానింగ్ లో ఉన్నట్టు ఈ మధ్య వార్త వినిపించాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉంది ఈ వ్యవాహారం, మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ ఓ టాక్ షో ను ప్లాన్ చేస్తుందని సమాచారం. ఈ టాక్ షో కు హోస్ట్ గా దగ్గుబాటి రానా ఉండబోతున్నారుట. దాదాపు అంతా సెట్ అయిందని తెలుస్తుంది. ఫస్ట్ గెస్ట్ గా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ రానున్నారట.అలాగే రెండవ ఎపిసోడ్ కోసం యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల రానున్నారట, అదే జరిగితే ఈ టాక్ షో సూపర్ హిట్ అవడం గ్యారెంటీ. త్వరలోనే ఈ వవిషయమై అధికారిక ప్రకటన రానునట్టు టాక్ నడుస్తోంది