టాలీవుడ్‌లో అనుపమ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ కావొస్తోంది కానీ సోలో హీరోయిన్‌గా శతమానం భవతి, టిల్లు స్క్వేర్ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. టిల్లు2లో లిల్లీ క్యారెక్టర్లో గ్లామర్ డోస్ పెంచి పొట్టి దుస్తులు, సిద్దు జొన్నలగడ్డతో కిస్సులు, రొమాన్స్ అంటూ ఆరాచకం సృష్టించడంతో హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. అదే టైంలో విమర్శకుల ప్రశసంలు దక్కాయి. ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. తిరిగి స్కిన్ షో జోలికి పోని భామను.. సక్సెస్ కూడా పెద్దగా పలకరించడం లేదు.
Also Read : Bollywood : రీమేక్ చేస్తే హిట్.. స్ట్రయిట్ సినిమా చేస్తే డిజాస్టర్.. యంగ్ హీరోకు వింత పరిస్థితి
ఈ ఏడాది పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకు వచ్చేస్తోంది అనుపమ. డ్రాగన్ హిట్ కొట్టేసినా, క్రెడిట్ మాత్రం కయాద్ లోహార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈమె సెకండ్ హీరోయిన్ రోల్‌కు పరిమితమైంది. ఇక ఓన్ ఇండస్ట్రీలో చేసిన జానకి V వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదాలతో నలిగి రిలీజ్ అయి ప్లాప్ గా మిగిలింది. ఇక హోప్స్ అన్నీ పరదాపై పెట్టుకుంటే విమర్శకుల ప్రశంసలైతే దక్కించుకుందీ కానీ కాసులను కూడగట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఉప్మా ఆశలన్నీ బెల్లంకొండ శ్రీనివాస్ పైనే పెట్టుకుంది. రాక్షసుడుతో మంచి హిట్ అందుకున్న ఈ పెయిర్.. నెక్ట్స్ కిష్కిందపురి అంటూ సందడి చేయబోతున్నారు. సెప్టెంబర్ 12న మిరాయ్ తో పోటీగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు పిల్లలు, గుండె ధైర్యం లేని వారు సినిమాకు దూరంగా ఉండాలని టీం విజ్ఞప్తి చేస్తోంది. ఈ రిక్వెస్ట్ చూస్తుంటే హారర్ పీక్స్ లెవల్లో ఉండబోతుందని అర్థమౌతోంది. మరి ఈ సినిమాతోనైనా కర్లీ హెయిర్ గర్ల్ బ్లాక్ బస్టర్ కొడుతుందా. రాక్షసుడు పెయిర్ మరోసారి సూపర్ హిట్ జోడీ అనిపించుకుంటుందా మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.