ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాస్తైనా అదృష్టం ఉండాలి. ఆ లక్, లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. మరాఠి భామ రిద్ది కుమార్ విషయంలో అదే జరిగింది. ఏడేళ్ల సినీ కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. లవర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిద్దీ. ప్రభాస్‌తో నటించినా ఫేట్ మారలేదు. మెయిన్ ఇండస్ట్రీలను చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్‌తో ఒక్కసారి నటించే అవకాశమొస్తేనే లక్కీగా ఫీలవుతుంటారు భామలు. కానీ రిద్ది కుమార్‌కు టూ టైమ్స్ నటించే ఛాన్స్ వచ్చింది.
Also Read : Exclusive : వాయిదా పడుతున్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్.. కారణాలు ఏంటి.?
రాధే శ్యామ్‌లో కీ రోల్ ప్లే చేసింది మరాఠీ భామ. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్‌లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె కెరీర్‌ను మార్చేస్తుందని అనుకుంటే ఆ సినిమా ప్లాప్ కావడంతో రిద్దికి నిరాశ తప్పలేదు. ఈ మూడేళ్లలో సలామ్ వెంకీ, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ చిత్రాలు తప్ప మరో మూవీ చేయలేదు. చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇప్పుడు రిద్ది కుమార్ హోప్స్ అన్నీ ప్రభాస్ రాజా సాబ్ పైనే. మారుతి- డార్లింగ్ కాంబోలో తెరకెక్కుతోన్న రాజా సాబ్‌లో రిద్ది వన్ ఆఫ్ ది హీరోయిన్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌తో పాటు ఈ భామ నటించబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ కట్‌లో మెరిసింది. రాధే శ్యామ్‌లో జస్ట్ టూ, త్రీ సీన్లకే పరిమితమైన బ్యూటీ రాజా సాబ్‌లో డార్లింగ్‌తో ఎక్కువ సేపే స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాక్. డిసెంబర్ 5న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది రాజా సాబ్. ఈ ఒక్క మూవీ తప్ప మరో మూవీ చేతిలో లేని భామకు.. డార్లింగ్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఆశగా చూస్తోంది.