వాస్తవానికైతే.. దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌తో సినిమా ఆడదని అనుకున్నారు. అదే జరిగితే.. దేవర 2 రావడం కష్టం అని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. ఆడియెన్స్‌కి స్లో పాయిజన్‌లగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో వచ్చిన సినిమా అవడంతో.. ఫస్ట్ డే దుమ్ముదులిపేసింది దేవర పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల పరంగా టాప్ టెన్‌లో నిలిచింది. మూడు రోజుల్లో 304 కోట్లు, ఐదు రోజుల్లో 396, వారంలో 405 కోట్లు కొల్లగొట్టింది దేవర. మొత్తంగా ఫస్ట్ వీక్‌లోనే 400 క్లబ్‌లో దేవర ఎంటర్ అయింది.
Jr NTR : ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. అదే నిజం!
మరి దేవర 1 హిట్ అయింది కదా.. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటుందా? అని ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ‘దేవర 2’ ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్, కొరటాల ఇద్దరూ కూడా కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ ‘వార్-2’, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్‌లో పెట్టాడు. ‘వార్-2’ ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే వరకు ‘దేవర-2’ కోసం ఎన్టీఆర్ డేట్లు కష్టమే. దీంతో.. 2026 తర్వాత ‘దేవర 2’ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ గ్యాప్‌లో కొరటాల కూడా మరో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నాడట. ఇదే జరిగితే.. ‘దేవర-2’ రిలీజ్ 2027 లేదా 2028లో ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి దీని పై కొరటాల క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.