Jr NTR Speech at Devara Success Celebrations: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్లు మాత్రం భారీగా ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓవరాల్ గా ‘దేవర’ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుంది చెప్పొచ్చు. కాగా దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగాయి. అభిమానులకు, మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్‌రాజు, నందమూరి కళ్యాణ్‌రామ్, దానయ్య, నాగవంశీ, దేవర డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మీ కోసం