దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ ఆల్మోస్ట్ ముగింపు దశకు చెరకుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ చేసే యుద్ధానికి బిగ్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయని బీ టౌన్ లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దీంతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ పీక్స్‌లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ ఇద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఆడియెన్స్ విజువల్ ట్రేట్ అని చెప్పడంలో సందేహం లేదు.
Also Read : Un Released Tamil Movies : ఈ స్టార్ హీరోల సినిమాలు ఇంకా ల్యాబ్ లోనే మగ్గుతున్నాయని తెలుసా..?
ఇప్పటికే ఇద్దరి పై నాటు నాటు రేంజ్ మాస్ సాంగ్ ను వార్ -2లో ప్లాన్ చేసినట్టుగా టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు వార్ 2 గురించి అలా, ఇలా అని చెప్పుకోవడమే తప్ప అసలు టైగర్ లుక్ ఎలా ఉండబోతోంది, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందనే, దాని పై ఓ అంచనాకు రావాలంటే ఫస్ట్ లుక్ బయటికి రావాల్సిందే. ఇప్పుడా సమయం రానే వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాలిడ్‌గా డిజైన్ చేసి లాక్ చేసి పెట్టుకున్నారట మేకర్స్. కాకపోతే ఓ మంచి సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారట. అతి త్వరలోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్ 2 టీజర్ విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.