టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికె గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి సినిమాలను రిలీజ్ చేసాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా ప్రకటించాడు విశ్వక్.
Also Read : Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
ఈ సినిమా విశ్వక్ మొదటిసారి లేడీ గెట్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందట అనౌన్స్ చేసాడు. మెకానిక్ రాకి రిలీజ్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టిన విశ్వక్ ఇటీవల సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసారు మేకర్స్.తాజగా నేడు ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లైలా సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.అలాగే లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలోని లైలా లుక్ ఆడియెన్స్ కు సరికొత్త ట్రీట్ ఇస్తుందని యూనిట్ భావిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.