టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కూతురు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విరాట్ శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. దీంతో ఆయనకు అభిమానుల నుంచి వెల్లువలా ప్రశ్నలు వచ్చి పడ్డాయి. అయితే ఓ నెటిజన్ మాత్రం విరుష్క దంపతుల న్యూ బోర్న్ బేబీ వామిక ఫోటోలు అడగడంతో పాటు, ఆ పాప పేరుకు అర్థం ఏంటని ప్రశ్నించాడు. దానికి స్పందించిన విరాట్… “దుర్గాదేవికి వామిక మరొక పేరు. సోషల్ మీడియా అంటే ఏమిటో అర్థం చేసుకునే వరకు, ఆమె సొంతంగా ఆలోచించే వరకు మా బిడ్డను సోషల్ మీడియాకు బహిర్గతం చేయకూడదని, దూరంగా ఉంచాలను మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపి వారి అభిమానులకు షాకిచ్చారు. వామికకు చూడాలని విరుష్క దంపతుల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సెషన్లో చివరగా ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా ?.. ఇంకెవరు అనుష్క… ‘ముఖ్యమైన’ ప్రశ్న “మీరు నా హెడ్‌ఫోన్‌లను ఎక్కడ ఉంచారు?” అంటూ అనుష్క ప్రశ్నించగా… దానికి విరాట్ “ఎప్పుడూ సైడ్ టేబుల్ మీద, మంచం పక్కన లవ్” అంటూ ప్రేమగా సమాధానం ఇచ్చాడు.