దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తుంది’ అని అన్నారు.
Also Read:Tammudu: ‘భూ భూతం..’ అంటున్న తమ్ముడు
అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ .. ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాను. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని అన్నారు.