‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్…
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి…