మెగాస్టార్ చిరంజీవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న మెగాస్టార్ ప్రస్తుత వయసు 69. కానీ ఈ రోజు విడుదలైన చిరు లేటెస్ట్ స్టిల్స్ చూస్తే తనయుడు చరణ్ కంటే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదరగొడుతున్నారు.
ఇప్పుడే వెండి తెరకు పరిచయం కాబోతున్న యంగ్ అండ్ డైనమిక్ హీరోల ఉన్నారు మెగాస్టార్ చిరు అని చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ది బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ.. ఆ కటౌట్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు రికార్డులు కూడా తమని శాసించే రారాజు వచ్చాడని జేజేలు పలుకుతాయి. దటీజ్ మెగాస్టార్..
చొక్కా మడతపెట్టి, రేబాన్ గ్లాస్ ని పెట్టి ఓ లుక్ లో బాస్ స్వాగ్ 90 ల మెగాస్టార్ లుక్ చూసి వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి
మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభర ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విశ్వంభర వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.