విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కుమారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు అశోక్ ఆర్ట్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. కానీ యూనిట్ మాత్రం సూపర్ సక్సెస్ అయినట్లుగానే చెబుతోంది. తాజాగా ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయశాంతి మీడియాతో ముచ్చటించింది. అయితే సక్సెస్ మీట్‌లో ఆమె కొంతమంది కావాలని సినిమాని చంపేస్తున్నారని, అలాంటి వారందరికీ వార్నింగ్ ఇస్తున్నానంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు.
Lady Aghori: పూజల పేరుతో లక్షల్లో మోసం.. లేడీ అఘోరీ అరెస్ట్
ఈ పరిణామాలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను ఇదే సినీ పరిశ్రమ నుంచి వచ్చాను. నన్ను సూపర్ స్టార్‌ని చేసింది ఇదే సినీ పరిశ్రమ. ఆ ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నేను జరుగుతున్నవి, చూస్తున్నవి, నేను విన్నవి స్టేజ్ మీద మాట్లాడాను. నేను ఫలానా వారు అని పేరు పెట్టి చెప్పడం లేదు, కానీ మన చుట్టూ ఇది జరుగుతోంది. ఒక ఇండస్ట్రీ చావాలి అని అనుకోకూడదు, బతకాలి. ఎందుకంటే ఇది ఒక మహా వృక్షం లాంటిది. ఇక్కడ మేము బతుకుతున్నాం, సినీ పాత్రికేయులుగా మీరు బతుకుతున్నారు. అన్నీ కొత్తగా ఏమీ రావు. ఉన్నదాంట్లోంచి తీసి వండాల్సి ఉంటుంది.
మనం ఒక కూర నుంచి నాలుగైదు రకాలుగా కోరలు వండొచ్చు, కానీ లక్ష రకాల కూరలు వండలేం కదా. సినిమా కూడా అంతే. ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ఉన్న వాటిలో మంచిగా చేయాలి అనుకోవాలి. కానీ ఇంకా ఏదో కావాలి అని అంటూ కళ్ళు, ముక్కు, చెవులు పెట్టేసి సినిమాని క్రిటిసైజ్ చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. మీకు నచ్చకపోతే దర్శకుడు, నిర్మాతకు సజెషన్స్ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఎవరైతే సినిమా మీద నెగిటివ్ మాట్లాడుతున్నారో, వాళ్ళ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉంటే ఇవ్వవచ్చు. కానీ బాగున్నదాన్ని పబ్లిక్‌గా వచ్చి బాలేదు అని చంపకండి. అలా చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది అందుకే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.