కింగ్డమ్ సినిమా రిలీజ్ ముందు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జూలై 28 ఇంకా రెండు రోజులే సినిమా రిలీజ్ గా ఉంది. లోపల భయమేస్తుంది అలాగే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే ఒక హ్యాపీనెస్ ఉంది. మేము చేసిన సినిమా పట్ల మేమంతా ఒక టీం గా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చాను అంటూ ఫ్యాన్స్ గురించి ప్రస్తావించారు. మీరు వేరే అబ్బా మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం.
Also Read:Thelusukada : ‘తెలుసుకదా’ నుంచి మల్లిక గంధ సాంగ్ రిలీజ్..
ఇన్ని వేల మంది అందరి గురించి వచ్చి వేచి చూసి మేము వచ్చినప్పుడు మీ అరుపులు రెస్పాన్స్ మీ ప్రేమ నాకు గుండెల వరకు ఫీల్ అవుతున్నాను. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్లినా ఏ సినిమా థియేటర్ కి వెళ్లినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం. అయితే అది ఎలానో ఎందుకు. మొన్న ఫాన్స్ కలుస్తాను అంటున్నారు అంటే కలుద్దామని సారథి స్టూడియోస్ లో కలిశాను. 2000 మంది వచ్చి కలిసారు. అందులో 1500 మంది లవ్ యు అన్నా లవ్ యు బ్రో లవ్ యు విజ్జు లవ్ యు చిన్ను అని విన్నాను.
Also Read:Gottipati Ravi Kumar: టెన్షన్ అస్సలు వద్దు.. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించం!
అందులో 1000 మంది అన్నా మనం కొడుతున్నాం అన్నా మనం కొట్టాలన్నా అన్నా మనం టాప్ లో కూర్చుంటున్నాం అన్నా అన్నారు. ఈ మాటలన్నీ విని నాకు ఎలా అనిపించింది అంటే నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా సినిమా ఆడాలని మొక్కుకుంటున్నారు ఒక అతను కుంభమేళాలో నా ఫోటో తీసుకువెళ్లి గంగా స్నానం చేయించాడు నీవు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తాను. మా గురించి గొడవలు పడుతూ ఒక డ్యూటీ లాగా పెట్టుకుని కూర్చున్నారు.