Thelusukada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసుకదా. రాశిఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరజా కోన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. దీన్ని రొమాంటిక్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా నేడు మల్లారెడ్డి వుమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ మల్లికా గంధని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. లవ్ బీట్ తో సాంగ్ ఆకట్టుకుంటోంది. థమన్ అందించిన మెలోడీ బీజీఎం మ్యూజిక్ లవర్స్ ఇష్టపడేలా ఉంది.
Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
ఈ పాటలో తంబూరా, ఫ్లూట్ లాంటి ట్రెడీషినల్ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ తో తీశాం. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది. ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడాడు. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్ లో ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తోంది. వైవాహర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్.
Read Also : HHVM : క్రిష్ కథతో వీరమల్లు సెకండ్ పార్టు..!