Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.వరుస సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్ దేవరకొండకు గత ఏడాది “బేబీ”సినిమాతో మంచి విజయం లభించింది.బేబీ సినిమాలో ఆనంద్ నటనను ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ “గం గం గణేశా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read Also :Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..
ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా ఈ నెల 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.తన గొంతు ,ఆనంద్ గొంతు ఒకేలా ఉంటుంది.దీనితో మేమిద్దరం మా గర్ల్ ఫ్రెండ్స్ ని సరదాగా ఆటపట్టించేవాళ్లమని విజయ్ తెలిపారు.అలాగే ఇంట్లో మా అమ్మ ని పిలిచినప్పుడు మా ఇద్దరిలో ఎవరు పిలుస్తున్నారో తాను అస్సలు గుర్తు పట్టలేదు.అలా మా ఇద్దరి వాయిస్ విషయంలో అందరు కన్ఫ్యుజ్ అవుతారని విజయ్ దేవరకొండ తెలిపారు.