విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేసిన ఈసారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్ అయిన “రోమియో” చిత్రం చేశారు.
ఈ సినిమాలో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుంది. భార్య ప్రేమను పొందేందుకు తంటాలు పడే భర్తగా ఆయన విజయ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్ మృణాళిని రవి యాక్టింగ్ అదరగొట్టింది.ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్లను భారీగానే చేశారు.ఏప్రిల్ 11న రోమియో థియేటర్లలో రిలీజ్ అయింది .అలాగే ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో రిలీజ్ అయింది.అయితే థియేటర్స్ లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న రేంజ్‍లో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది.ఈక్రమంలో ఈ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.రోమియో సినిమా మే 10వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు గురించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.రోమియో తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ సినిమా కూడా మే 10వ తేదీన ఆహా తెలుగు ఓటీటీలోకి వస్తుందో లేదో చూడాలి.