బలగం దర్శకుడు వేణు యేల్దండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన సినీ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న కామెడీ రోల్స్ చేసిన వేణు ఆ తరువాత ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు..దర్శకుడు కావాలనే కోరిక అతనిని ఎప్పటి నుంచో ఊరిస్తుంది .బలగం సినిమాతో ఆ కల నెరవేరింది .బలగం సినిమా ఊహించని విజయం సాధించి వేణు కెరీర్ మార్చేసింది .బలగం సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు వేణునీ ప్రశంసించారు.హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.బలగం సినిమాతో దర్శకుడు వేణుకి న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశం దక్కింది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఇదిలా ఉంటే దర్శకుడు వేణు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కమెడియన్ ధనరాజ్ తో కలసి అలీ తో సరదాగా షో కి హాజరయ్యారు. తాజాగా ఈ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో లో కమర్షియల్ చిత్రాలు రాణిస్తున్న ఈ సమయంలో బలగం లాంటి పల్లెటూరి భావోద్వేగాల నేపథ్యంలో సినిమా చేయడానికి కారణం ఏంటి అని అలీ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు వేణు ఎలాంటి సమాధానం ఇచ్చాడో పూర్తి ఎపిసోడ్ లో చూపించనున్నారు .అలాగే బలగం సినిమా చేసే సమయం లో తనకి ఎదురైన అవమానం గురించి వేణు తెలిపారు.సినిమా మేకింగ్ లో టెక్నీషియన్స్ తో చర్చలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో ఓ టెక్నీషియన్ ఏదో పెద్ద బాహుబలి తీస్తున్నట్లు ఫీల్ అవుతున్నావ్ అంటూ నన్ను అవమానించాడు. కానీ బలగం సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలలోనే బాహుబలిగా నిలిచిందని తెలిపారు .