టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇటీవల “వకీల్ సాబ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో శ్రీరామ్ వేణు కూడా ఒకరు. ఇక ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో “ఐకాన్” చిత్రం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలేవీ కన్పించకపోవడంతో మరో ప్రాజెక్ట్ ను రూపొందించాలని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు శ్రీరామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నానితో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’తో హిట్ కొట్టిన శ్రీరామ్ తో కలిసి పని చేయడానికి నాని కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్టు టాక్. శ్రీరామ్ త్వరలో తన కథను నానికి చెప్పబోతున్నాడు. కథ విన్నాక నాని ఈ ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకోనున్నాడు. శ్రీరామ్ తన స్క్రిప్ట్‌తో నానిని ఆకట్టుకోగలిగితే… ‘శ్యామ్ సింగ రాయ్’ పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ రూపొందే అవకాశం ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో “ఎంసిఏ’ తెరకెక్కిన విషయం తెలిసిందే.