Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్ కానుందని దర్శకుడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్‌లో జరగనున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల గ్యాప్‌లోనే, అంటే జూన్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
అనిల్ రావిపూడి గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి కొత్త సినిమా కూడా సంక్రాంతి టార్గెట్‌గానే తెరకెక్కుతుందని సమాచారం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన షూటింగ్ అప్డే్ట్తో వెంకీ మామా – కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Varun Tej: 'బరి'లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
- Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
- Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
తాజావార్తలు
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!