నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటించిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, వాచ్ టైంతో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ.. ఉషాకిరణ్ కి శ్రీవారికి ప్రేమలేఖ ఎంతో ఈటీవీ విన్ కి ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అని అన్నాను. అనురాగ్ వన్ అఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్పాను. ఈ రోజు ఈ రెండు మాటలు ఈ రోజు ఫ్రూవ్ అయ్యాయి. 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సినిమా దూసుకుపోతోంది. బిగ్గెస్ట్ హిట్ ఇది. ఒక గౌరవాన్ని తెచ్చిన సినిమా. ఒక్క ప్రోడక్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది అలాంటి సినిమానే. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఇది ప్రేక్షకుల విజయం. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ’ అని అన్నారు.
డైరెక్టర్ అనురాగ్ మాట్లాడుతూ.. ఈ సినిమానికి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. నా డైరెక్షన్ టీంకి థాంక్ యూ. నరేష్ గారు పాజిటివ్ పర్శన్. నేను పది సినిమాలు చేస్తే ఆ సినిమాలన్నిటిలో నరేష్ గారు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన ప్రసంశలని మర్చిపోలేను’ అన్నారు.
డైరెక్టర్ సతీష్ వేగ్నేశ మాట్లాడుతూ..ఈ సినిమా మానవ సంబంధాల అనుబంధాల యాత్ర. ఇంతమంచి సినిమాని సపోర్ట్ చేసిన ఈటీవిన్ వారికి థాంక్ యూ. ఇలా సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలో ఇంకెన్నో వస్తాయి. నరేష్ గారు నవ్విస్తూ ఎమోషన్ పండించే యాక్టర్. ఆయన సవాల్ తో కూడిన పాత్రలని అద్భుతంగా చేస్తారని మరోసారి ప్రూఫ్ చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ తెలిపారు.