మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్‌తేజ్ కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే.. సినిమా జానర్ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకన్ల వీడియోను రిలీజ్‌చేశారు. యాక్షన్… థ్రిల్లర్.. కామెడీ.. హారర్.. రొమాన్స్. జానర్ పేరు చెప్పడానికి ఒక సెకన్ చాలు. కానీ వరుణ్‌తేజ్ ఫస్ట్ టైం హారర్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎఫ్3 తర్వాత వచ్చిన మూడు సినిమా గాంఢీవధార అర్జున్.. ఆపరేషన్ వాలెంటైన్.. మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడనుకుంటే.. ఎవరూ ఊహించనివిధంగా హారర్ కామెడీని ఎంచుకున్నాడు? వరుస ఫ్లాపుల్లో వున్న వరుణ్‌ను కమెడియన్ సత్య ఓదార్చడంతో వీడియో మొదలైంది. దానికి తోడు ప్రతి సారి రూట్ రూట్ అంటుంటే అదేదో అనకూడని పదం అన్నట్టుగా వరుణ్ తేజ్ బిహేవ్ చేయడం గమనార్హం. మొత్తంగా రూట్ పదాన్ని చూసి వరుణ్ ఎందుకు అలా అలెర్ట్ అయ్యాడో తెలియదు మరి.
Ambati Rayudu: ఐపీఎల్లో అతనే నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్
వరుణ్‌తేజ్‌తోపాటు డైరెక్టర్ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో వున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. ఎక్స్‌ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానీతో తీసిన ‘కృష్టార్జున యుద్ధం’… మాస్ట్రో… ‘లైక్ షేర్ సబ్‌స్కైబ్ ‘ ఫ్లాప్ అయ్యాడు రెండేళ్లు గ్యాప్‌తీసుకుని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్‌తో వస్తున్నాడు దర్శకుడు. వరుస ఫ్లాపులతో వరుణ్ వెనుకపడిపోకుండా.. ఐదు నెలల్లో కొరియన్ కథతో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. జానర్ ఏదో చెప్పడానికి రిలీజ్ చేసిన వీడియోతో ఇంప్రెస్ చేశాడు దర్శకుడు.గద్దలకొండ గణేశ్ తర్వాత మరోసారి లాంగ్ హెయిర్… బియర్డ్‌తో కనిపించనున్నాడు వరుణ్. సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.