టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, సుహాస్ తో పాటుగా బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, నేరుగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీగా విడుదల కానుంది.
Also Read : Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక
జూలై 4న నుండి తెలుగు ప్రేక్షకులకే కాకుండా దేశ వ్యాప్తంగా విస్తృతంగా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. అందుకే ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 240 కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం చేయనున్నారు. ఇక కథ విషయానికి వస్తే .. ఈ సినిమా కథ 1990 నాటి కాలం నడుస్తోంది. గ్రామీణ వాతావరణంలో సాగే, చమత్కారం , హాస్యభరితంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులకు నవ్వు పంచడమే కాకుండా ఒక ఆలోచన రేకెత్తించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర బృందం తెలిపింది. “ఇలాంటి విలక్షణమైన గ్రామీణ నేపథ్య చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది” అని నిర్మాత రాధిక లావు పేర్కొన్నారు.