Ram : యంగ్ హీరో రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సె నటిస్తోంది. ఈ మూవీలో రామ్ లుక్ వింటేజ్ లో కనిపిస్తోంది. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరు ప్రచారం ఉంది. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇక రామ్ బర్త్ డే రోజు టైటిల్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర ఉందంట. దాని కోసం ఓ సీనియర్ హీరోను వెతుకుతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ ను సంప్రదించారు.
Ram : Allu Arjun Atlee: బన్నీ కోసం ఐదుగురు భామలు?
కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదంట. దాంతో ఉపేంద్రకు కథను వినిపించారంట. ఈ సినిమా కోసం ఆయన్ను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. ఉపేంద్ర గతంలో కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించేందుకు ఉపేంద్ర సిద్ధంగానే ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర యాక్ట్ చేస్తే మూవీకి మంచి హైప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.