Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కేవలం ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. అందులో తరుణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్ తో ఒక్కో సినిమా చేసిన త్రివిక్రమ్… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం మూడేసి సినిమాలు తీశారు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు స్టార్స్ తోనూ త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా సంక్రాంతి కానుకగానే విడుదల కావటం. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ 2008 ఏప్రిల్ లో రిలీజ్ కాగా, రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ 2013 సెప్టెంబర్ లో వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. బట్ ఈ సినిమా మొదటి రెండు చిత్రాలతో పోల్చితే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ మూడు సినిమాలు చేశారు.
Read also: Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జులాయి’ 2012 ఆగస్ట్ లో విడుదల కాగా రెండో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 2015 ఏప్రిల్ నెలలో వచ్చింది. ‘జులాయి’ స్థాయి విజయాన్ని అందుకోక పోయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చి పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ సెంటిమెంట్ ను ఈ సినిమా చెరిపేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసిన మరో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు. వీరిద్దరి మొదటి సినిమా ‘అతడు’ 2005 ఆగస్ట్ లో విడుదలైంది. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలానే రెండో సినిమా ‘ఖలేజా’ 2010 అక్టోబర్ లో జనం ముందుకు వచ్చింది. కానీ ‘అతడు’లా ఇది మెప్పించలేకపోయింది. అయితే ‘అతడు’లాగే ఈ సినిమా కూడా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘గుంటూరు కారం’ చేస్తున్నారు. చిత్రం ఏమంటే పవన్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడో సినిమా సంక్రాంతికి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి ‘అతడు, ఖలేజా’ చిత్రాలను మించిన విజయాన్ని ‘గుంటూరు కారం’తో మహేశ్, త్రివిక్రమ్ అందుకుంటారేమో చూద్దాం.
Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
తాజావార్తలు
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!