టాలీవుడ్‌లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
Also Read:Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
దీనికి సంబంధించి వచ్చే వారం త్రివిక్రమ్, రామ్ చరణ్‌ల మీటింగ్ కూడా జరగబోతోంది. నిజానికి, త్రివిక్రమ్, రామ్ చరణ్ ఎప్పటినుంచో కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎన్నో కారణాల వల్ల ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. ఒకవేళ త్రివిక్రమ్ చెప్పిన కథ రామ్ చరణ్‌కు నచ్చి, ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది ఒక షాకింగ్ కాంబో అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజస్ రగ్గడ్ లుక్‌లో ఉంటూ పెద్ది సినిమా కోసం షూట్ చేస్తున్నాడు.
Also Read:Anirudh: అనిరుథ్‌కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?
ఒకవేళ త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చితే, రామ్ చరణ్ ఆ పెద్ద సినిమా డేట్స్ నుంచే డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకు ఇవ్వాల్సి ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని అంటున్నారు. మరోపక్క, చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. కాబట్టి, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయితే, సినిమా కాస్త వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. హారిక హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.