టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి.
Also Read: Anirudh: అనిరుథ్‌కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?
అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా రేట్లు తగ్గించేశాయి. అంతేకాకుండా, అంతకుముందు ఏ సినిమా అయినా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవి, కానీ ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా స్టార్లు నటించిన సినిమాలైతేనే, లేకపోతే మంచి టీమ్ పని చేసిన సినిమాలను మాత్రమే తీసుకుంటున్నాయి. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?
ఇప్పుడు టాలీవుడ్‌లో ఏకంగా 300 చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండి కూడా రిలీజ్‌కు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు అందరూ ఏదో ఒక ఓటీటీ తమ సినిమా కొనుగోలు చేస్తే, పెట్టిన డబ్బులు ఎంతోకొంత రాకపోతుందా? ఓటీటీ కొనుగోలు చేసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతున్నామా? అనే ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ అది ఎప్పటికీ తీరుతుందో తెలియడం లేదు.