వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది.
డాకు మహారాజ్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు తమన్. ప్రతీ సీన్ ను తనదైన శైలిలో ఎలివేట్ చేస్తూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు తమన్. రాయలసీమలోని ఓ థియేటర్ లో తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దాటికి తట్టుకోలేక స్పీకర్లు కాలిపోయాయి అంటే అర్ధం చేసుకోండి తమన్ ఏ స్థాయిలో ఈ సినిమాకు డ్యూటీ చేసాడో. అయితే గత కొద్ది రోజులుగా డాకు మహారాజ్ OST ని విడుదల చేయమని సోషల్ మీడియాలో ప్రేక్షకులు చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారడంతో స్పదించిన తమన్ డాకు మహారాజ్ OST ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నాం అని అఫీషియల్ గా ప్రకటించాడు. దీంతో తమన్ తాండవానికి స్పీకర్లు పగిలిపోతాయి జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.