ఓ సినిమా హిట్టు పడగానే.. కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి టయ్యప్స్ క్రేజీనెస్ తెచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మ్యాడ్ నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి, వెంకటేష్-అనిల్ రావిపూడి, త్రివిక్రమ్-బన్నీ కాంబోలకు సెపరేట్ ఇమేజ్ ఉంది. హిట్టిచ్చిన డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు నందమూరి నట సింహం. బాలయ్య- బోయపాటి శ్రీను తలుచుకుంటే దబిడిదిబిడి అయిపోవాల్సిందే. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ ఇద్దరు నెక్ట్స్ ప్రాజెక్ట్ షురూ చేశారు. రీసెంట్లీ అఖండ 2 షూటింగ్ స్టార్టైంది. వీరసింహారెడ్డితో డీసెంట్ హిట్టునిచ్చిన గోపీచంద్ మలినేనితో మరో ప్రాజెక్టుకు గాడ్ ఆఫ్ మాసెస్ ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో గట్టి బజ్ నడుస్తోంది.
Also Read : 45The Movie : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కన్నడ బిగ్గెస్ట్ మల్లీస్టారర్ మూవీ
ఫ్యామిలీ హీరో వెంకటేష్‌తో కలిసి ఫన్ అండ్ ప్ట్రస్టేషన్‌తో కూడిన సినిమాలు తీసి.. హిట్స్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 మాసివ్ విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్లీ వచ్చిన సంక్రాంతికి వ వస్తున్నాం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. దీంతో టీం సంబంరాలు చేసుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో వెంకీ మామతో పది సినిమాలు చేస్తానంటూ ప్రామిస్ చేసేశాడు అనిల్. వీళ్లే కాదు త్రివిక్రమ్ అంటే త్రీ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బన్నీ. ఈ ముగ్గురితోనే రిపీటెడ్ గా సినిమాలు చేశాడు. నెక్ట్స్ అల్లు అర్జున్‌తో సినిమా ఉండబోతోది. ఈ కాంబోలో ఫోర్త్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతోoది. అలాగే సుకుమార్‌తో ఫోర్ పిక్చర్స్ కంప్లీట్ చేశాడు ఐకాన్ స్టార్. వీరిటీతో పాటు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్‌తో రిపీట్ చేస్తుంటే రామ్ చరణ్ తో సుక్కు సెట్ చేసుకున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ తమకు హిట్ ఇచ్చిన దర్శకులని రిపీట్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.