టాలీవుడ్ సినీనటుల ఉత్తమ ప్రదర్శనకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డులను అంజేసేవారు. అప్పటి ప్రభుత్వాలు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు కూడా. కానీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ కాయక్రమాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నంది అవార్డులను ప్రకటించింది, విజేతలకు అవార్డులు అందజేశారు తప్ప వేడుక నిర్వహించలేదు. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించింది.
Also Raed: Kiran Abbavaram: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన రాజావారు రాణిగారు.
ఈ ఏడాది గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ఆ పురస్కారాలు ఇస్తామని తెలిపారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఈ గురువారం గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు కొందరు సినీ ప్రముఖులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు ఛైర్మన్గా వ్యవహరించనుండగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజును వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ కమిటీకి సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది